ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి
- రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి
- కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పల్స్ పోలియో చుక్కల పంపిణీ
కామారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చడంలో ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ సహకారంతో రోటరీ క్లబ్ నిరంతరం శ్రమిస్తూ, ప్రతి సంవత్సరం నిర్దేశిత తేదీల్లో పోలియో చుక్కలను అందిస్తూ వస్తోందని తెలిపారు.
ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ పాల్గొన్నారు. వారితో పాటు రోటరీ క్లబ్ ప్రముఖులు డాక్టర్ రవీందర్ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శంకర్, సెక్రటరీ కృష్ణ హరి, ట్రెజరర్ రమణ, రాజనరసింహ రెడ్డి, ధనంజయ్, సంతోష్ మరియు సీనియర్ రోటేరియన్లు పాల్గొన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించలేకపోయిన తల్లిదండ్రులు, సోమవారం కూడా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించవచ్చని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.






