29 June, 2026 | 2:03 AM

ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి

29-06-2026 12:00 AM

కలెక్టర్ ఆశిష్ సంగు వాన్

కామారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): ఐదేళ్ల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ కోరారు. ఆదివారం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రైత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు.

ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరంగా కాకుండా చూడాలని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలు మొబైల్ బృందాల సేవలను జిల్లా ప్రజల సద్వినియోగం చేసుకుని అర్హులైన చుక్కలు వేయించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వైద్యులు అంగన్వాడి సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.