వర్చువల్‌గా బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
29-06-2026 12:00 AM
- బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ
- జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
కామారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం పర్చువల్ పద్ధతిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారి సందేశాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, బిజెపి రాష్ట్ర నాయకులు మురళీధర్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, బాపురెడ్డి, విపుల్ జైన్, తదితరులు పాల్గొన్నారు.






