12 March, 2026 | 2:27 PM

Breaking News

మళ్లీ తెరపైకి మద్యం కేసు.. కవిత ఇంటికి సీబీఐ అధికారులు   •   నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే   •   భారత్‌కు ఊరట.. ఆయిల్ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి   •   అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి   •   పోలీస్ భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు   •   పెళ్లికి వెళ్తుండగా వాహనం బోల్తా.. ఇద్దరు మృతి   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి   •   గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి   •   గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి   •   గాజులపేట కాలనీలో నీటి సమస్యకు పరిష్కారం   •  

ఈద్గాలో అన్ని సౌకర్యాలు కల్పించాలి

12-03-2026 12:18 AM

సూర్యాపేట, మార్చి 11 (విజయక్రాంతి) : ఈ నెల 21న జరిగే రంజాన్ పర్వదినం పురస్కరిం చుకుని ఈద్గా వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని మునిసిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భాషానాయక్ తండాలో గల ఈద్గాను పరిశీలించి మాట్లాడారు. వేలాదిమంది ముస్లిం సోదరులు ఈద్గాకు చేరుకుని ప్రార్థనలు చేసే  అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలకు తావు లేకుండా చూడాలన్నారు.

ఈద్గామైదానంలో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందు కు పారిశుధ్య పనులు చేపడుతున్నారని తెలిపారు. ప్రార్థనకు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పండగ రోజున నీటి వసతి కల్పించాలన్నారు. పట్ణణంలోని అన్ని మసీదుల వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని, విద్యుత్ బల్బులు లేని చోట బల్బులను ఏర్పాటు చేయాలని, మసీదుల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ సండ్రపాటి విజయ్ కుమార్, రాపర్తి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొరిశెట్టి లక్షాధి, డి ఈ సత్య రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, 13 వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్యా మహేష్, రమేష్, ఉప్పలయ్య, రసూల్, చాంద్ పాషా, రఫీ, చౌకత్ అలీ, బిక్షం, సాయి, జవాన్ రఫీ, వార్డు ఆఫీసర్ నరేష్, జానయ్య  పాల్గొన్నారు.