గీతాంజలి విద్యార్థులకు జిల్లా ర్యాంకులు
ఎస్‌ఎఫ్‌ఐ టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ
ఖమ్మం, మార్చి 11 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లోని గీ తాంజలి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు పి నవదీప్, యు వేదశ్రీ ఎస్‌ఎఫ్‌ఐ టాలెంట్ టెస్ట్‌లో అద్వితీయమైన ప్రతిభ కనబరిచి జిల్లా ర్యాంకులు కైవసం చేసుకున్నారు. పి. నవదీప్‌కు జిల్లా మొదటి ర్యాంకు, యు వేదశ్రీకి జిల్లా స్థాయి 8 వ ర్యాంకు వచ్చాయి.
ఎస్‌ఎఫ్‌ఐ వారు జిల్లా స్థాయిలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ టివి అప్పారావు మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులకు తామిచ్చే అకాడమిక్ స్టాండర్డ్ వల్లే ఈ ర్యాం కులు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు టి. పద్మ, టి. అరుణ్, ఉపాధ్యాయులు అభినందించారు.




