14 April, 2026 | 1:30 PM

భక్తులకు అన్ని వసతులు కల్పించాలి

12-06-2025 01:11 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలుగకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. బోనాలు, మొహరం సందర్భంగా బుధవారం ఆయన డబీర్‌పుర, లాల్ దర్వాజ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ.. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని జోనల్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు కూడా  పరిశుభ్రతను పాటించాలని, వ్యర్థాలు నిర్దేశించిన ప్రదేశాలలో పారవేయాలని కమిషనర్ భక్తులను కోరారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ వెంకన్న, డీసీఏఎం అండ్ హెచ్‌ఓ ఉన్నారు.