27 July, 2026 | 12:55 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

బీసీల రిజర్వేషన్లకు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలి

29-03-2026 12:00 AM

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, బీసీల రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. శనివారం అసెంబ్లీలో పద్దులపై ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు.

కాలుష్య నివారణకు నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు బాగా పెరగాలని, అయితే వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుందన్నారు. కానిస్టేబుళ్లకు రావాల్సిన టిఏ, డీఏలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి అంశానికి హౌస్ కమిటీ అనేది పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు.