calender_icon.png 12 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతకు అండగా అఖిల పక్షం

12-11-2025 12:22:13 AM

  1. తేమ నిబంధన, కొనుగోళ్ల పరిమితిపై దశలవారీగా ఆందోళనలకు తీర్మానం
  2. అఖిలపక్ష సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి) : ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అమ్ముకోవడానికి రైతుల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి పక్షాన పోరాడేందుకు అఖిలపక్షం నేతలు ముందుకొచ్చరు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ దశల వారిగా ఆందోళనలకు సిద్ధం కావాలని అఖిల పక్షం పార్టీ నేతలు తీర్మానించారు. 

ఆదిలాబాద్ లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి నేతృత్వంలో బీఆర్‌ఎస్,  సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ధర్మ సమాజ్ పార్టీ, రైతు సంఘాల నేతలు సమావేశమై తేమ శాతం నిబంధన, కొనుగోళ్లలో పరిమితి విధించడం తోపాటు అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు, వాటి సాధనకు చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చిం చారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... అన్నదాతలకు అం డగా నిలవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. తేమ నిబంధనలు, కొనుగోళ్లలో పరిమితిని విధిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. తేమ నిబంధనలతో రైతులు పంటను అమ్మే పరిస్థితి లేదని, జిల్లలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు సడ లించాల్సిన అవసరముందన్నారు. ఎకరానికి ఏడూ క్వింటల్ల పరిమితిని తెచ్చి మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

పంటను అమ్ముకునేందుకు అన్నదా త నానా ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజా ప్రతినిధులు కనీసం స్పందించకపోవ డం శోచనీయమన్నారు. వేలిముద్ర నిబంధనను తొలగించడంతో పాటు, ఓటిపి నిబం ధనతో సోయాలను కొనుగోలు చేసేందుకు కృషి చేయాలి పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి తరపున నిలబడతామని, రైతు సంఘాలు, అఖిల పక్ష నేతలతో కలిసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

సమావేశంలో ఆయా పార్టీల నాయకులు దర్శనాల మల్లేష్, సిర్రా దేవేందర్, విజ్జగిరి నారాయ ణ, వెంకట నారాయణ, జగన్ సింగ్, రత్నపురి రమేష్, అగ్గిమల్ల గణేష్, బండి దత్తాత్రి, కొండ రమేష్ లోకారి పోశెట్టి, దారట్ల కిష్టు, గోవర్ధన్ యాదవ్  చిలుక దేవిదాస్, కేమ లక్ష్మణ్, గండ్రత్ రమేష్ సెవ్వ జగదీష్, కనక రమణ తదితరులు పాల్గొన్నారు.