calender_icon.png 12 November, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామాలయ గోశాలలో పశువైద్య శిబిరం

12-11-2025 12:23:06 AM

భద్రాచలం, నవంబర్ 11 (విజయక్రాంతి): ఐటిసి బంగారుభవిష్యత్ ప్రోగ్రాం ద్వారా బైఫ్ స్వచ్చంద సంస్ధ వారు భద్రాచలం రామాలయం గోశాలలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఫస్ట్ వైద్యశాల డాక్టర్ బాలకృష్ణ గోశాలలోని ఎదకు రాని, చూడి నిలువని 30 అవులకు పరీక్షలు చేసి చికిత్సలు చేశారు. 20 దూడలకు నట్టల మందు తాగించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక  అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు సందర్శింశించి గోశాల నిర్వహణపై విలువైన సూచనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఠాగూర్ ప్రసాద్, రామాలయం సూపర్డెంట్ శ్రీనివాసరెడ్డి, రామాలయం గోశాల నిర్వహణ అధికారి,  సదయ్య బైఫ్ సంస్థ జిల్లా అధికారి ఇబ్బంది పాల్గొన్నారు.