ప్రజా పాలన ప్రణాళిక అమలులో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న మేయర్, కలెక్టర్, ఎమ్మెల్యే
వరంగల్, మార్చి 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కా ర్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా అమలవుతోందని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్య క్రమం అమలులో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బల్ది యా మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్, ఇంచార్జ్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. అ ధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛత కార్యక్రమంలో పా ల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజ ల సంక్షేమం, సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రజా పాలన ప్రగతి ప్ర ణాళికను రూపొందించిందన్నారు.
పట్టణా లు, గ్రామాలు సమానంగా అభివృద్ధి చెం దాలనే ఉద్దేశంతో మౌలిక వసతుల కల్పన, పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పట్టణ ప్రాం తాల్లో పరిశుభ్రత, శానిటేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిం చాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాలనీలు, వీధులు పరిశుభ్రంగా ఉం డేలా మున్సిపల్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, ప్రతి పౌరుడు కూడా పరిశుభ్రతను కాపాడటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రజల సమస్యల కు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నా రు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భా గంగా వచ్చే 99 రోజులలో పట్టణాభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మా ర్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సానిటరీ సిబ్బంది, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ,నాయకులు పాల్గొన్నారు.




