మంత్రిపై ఆరోపణలు తగదు
రాగం ఆంజనేయులు యాదవ్
పంజాగుట్ట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): సిద్ధిపేట ప్రాంతానికి చెందిన భూముల వ్యవహారంలో మంత్రి పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని రాగం ఆంజ నేయు లు యాదవ్ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులందరి సమ్మతితోనే 15 ఎకరాలు 10 గుంటల భూమిని శ్రీబాలాజీ రియల్ ఎస్టేట్ యజమాని నోముల నాగార్జునకు విక్రయించినట్లు తెలిపారు.
బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ భూము ల వ్యవహారానికి రాజకీయ నాయకులతో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులపై తామే చట్టబద్ధ వారసులమని చెప్పారు. ఈ సందర్భంగా కొంతమంది యాదవ సంఘాల నాయకులు, ముఖ్యంగా రాగం రఘుతో కలిసి మంత్రి పై ఆరోపణలు చేయడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ కుటుంబ సభ్యులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో, తమకు సంబంధించిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించా రు. అధికారులను తప్పుదారి పట్టిస్తూ తమ ఆస్తులపై హక్కులు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంజనేయులు యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై నిజానిజాలు వెలికితీయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాగం కుటుంబానికి చెందిన లక్ష్మి, సులోచన, యాదమ్మ, కిషన్, లక్ష్మణ్ పాల్గొన్నారు.






