అందరి సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట ఏప్రిల్ 15 : అందరి సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని నెల్లికొండి, ఫర్దిపూర్, పల్లమర్రి గ్రామాల్లో ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ ఎ-గ్రేడ్ ధాన్యానికి రూ. 2,389, ఎ -గ్రేడ్ ధాన్యానికి రూ. 2,350 మద్దతు ధర నిర్ణయించిందని, దీనికి అదనంగా క్వింటాల్కు రూ. 500 బోనస్ అందజేస్తున్నామని తెలిపారు.
రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు.అనంతరం ఫర్దిపూర్లో 8 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించి విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.
గ్రామంలో సిసి రోడ్లు, మక్తల్ వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాల షెడ్డును ప్రారంభించి గ్రామ అభివృద్ధికి తమ కట్టుబాటును చాటారు. అనంతరం భూత్పూర్ మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు వివిధ పార్టీల నుంచి చేరిన వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






