11 May, 2026 | 8:34 PM

Breaking News

ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆర్డిఓ సుబ్రహ్మణ్యం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •   గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ లో చేరిన వార్డ్ సభ్యులు   •   ఎంఈఓ చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ ప్రారంభం   •   మిల్లుల వద్ద వరి ధాన్యం లారీలను వేగంగా అన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలి   •   ప్రజావాణికి భూకబ్జాల భాగోతం   •  

అర్హులైన పేదలందరికీ... డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించండి

11-05-2026 07:58 PM

జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించిన సిపిఐ పార్టీ నాయకులు

జవహర్ నగర్, మే 11 (విజయక్రాంతి): జవహర్ నగర్ లో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరుతూ  కలెక్టరేట్లో సిపిఐ పార్టీ నాయకులు సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సిపిఐ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటపల్లి శంకర్ నేతృత్వంలో సిపిఐ నాయకులు కలెక్టర్ ను కలిసి తమ విజ్ఞాపన పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా తోటపల్లి శంకర్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం వేలాది మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారని అయితే వారికి ఇల్లు కేటాయించకుండా కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల నెరవేరలేదని ఆయన దుయ్యబట్టారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అవస్థలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిశీలించాలని కోరారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, జిల్లా సమైక్య ప్రధాన కార్యదర్శి స్వరూప నాయక్, ఏఐటీయూ మండల అధ్యక్షులు అంబాల ఎల్లయ్య, గిరి ప్రసాద్ నగర్ శాఖ కార్యదర్శి కొండా సత్యం సాగర్, బి. నాని తదితరులు పాల్గొన్నారు.