11 May, 2026 | 8:43 PM

Breaking News

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి   •   ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన శివానికి సీఎం చేతుల మీదుగా ల్యాప్‌టాప్ ప్రదానం   •   కాసిపేట గనిని సందర్శించిన జీఎం రాధాకృష్ణ   •   ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆర్డిఓ సుబ్రహ్మణ్యం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •  

ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య

11-05-2026 08:00 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు ఆధునికత తో కూడిన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బోత్ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగు టీవీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి డిజిటల్ క్లాసుల నిర్వహణపై విద్యార్థులతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడం జరుగుతుందని విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు అర్థం కావాలన్న దృక్పథంతో ఎల్ఈడి లను ఏర్పాటు చేసింది అన్నారు. జూన్ 1 నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు కానందాన్ని ఆమె పేర్కొన్నారు.విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు డ్రెస్సులను ఉచితంగా అందిస్తుందని విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ నాందేవ్ నగేష్ గౌడ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రాజేందర్ లక్ష్మణ్ అనిల్ సిహెచ్ రవి యు అనిల్ విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు