బంజారా భవనానికి భూమి కేటాయించండి
అడిషనల్ కలెక్టర్‌కు వినతి
మేడిపల్లి, సెప్టెంబర్ 2: కేసుల చారిటబుల్ ట్రస్ట్ సేవ సంస్థ, ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సీతల భవా ని, సద్గరు సేవాలాల్ మహారాజ్, బంజారా సంస్కృతిక భవనం కు భూమి కేటాయించాలని అడిషనల్ కలెక్టర్ డి విజేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
20 సంవత్స రాలుగా చెంగిచర్ల, బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో, దాదాపు 10,000 కుటుంబాలు నివసిస్తున్నాయని, సంస్కృతి, సంప్ర దాయాలు, ఆచారాలు,గిరిజన ప్రజ ల వారసత్వాన్ని కాపాడేందుకు, సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహిం చేందుకు 4 ఎకరాల భూమి కేటా యించాలని కోరామని, దానికి అడి షనల్ కలెక్టర్ సాను కూలంగా స్పం దించారని తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ సేవ సంస్థ, మంజిలాల్ ధరవత్ మేనేజింగ్ ట్రస్టీ, సభ్యులు గుగులోత్ జీవన్ నాయక్, బానోత్ సునీత, యమ్ రేణుక పాల్గొన్నారు.






