7 August, 2026 | 9:50 AM

జోరుగా బీజేపీలో చేరికలు

03-09-2025 12:00 AM

మాసాయిపేట /చేగుంట, సెప్టెంబర్ 2 : దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి గ్రామా ల యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు వాల్దాస్  మల్లేష్ గౌడ్ అన్నారు. 

ఈ సందర్భంగా మంగళవారం మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన  సుమారు 25 మంది యువకులు బీజేపీలో చేరారు. గ్రామానికి చెందిన అగ్రవరం శ్రీకాంత్, దేవుని భాను ప్రసాద్, సందీప్ గౌడ్, అగ్రహారం గణేష్, అగ్రహారం రాజు, కర్రే రాజు, విగ్నేష్, దేవనూరి గణేష్, బాలయ్య, యాదగిరి, కొత్తూరు కిషన్ తదితరులు బీజెపిలో చేరారు.

వారిని జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాపన్న శ్రీకాంత్, శివకుమార్ గౌడ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నగేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు,  సోషల్ మీడియా కన్వీనర్ దేవనూరి సాయి, సీనియర్ నాయకులు ముక్క యాదగిరి, ఆర్‌ఎస్‌ఎస్ పోచయ్య,  రాజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, భూత్ అధ్యక్షులు రాములు, రవి, శ్రీనివాస్ మాసాయిపేట రెడ్డి, మల్లేష్, తదితరులుపాల్గొన్నారు.