calender_icon.png 28 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి జిల్లాలో 242 మద్యం దుకాణాల కేటాయింపు

28-10-2025 12:43:22 AM

- కలెక్టర్ల నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ 

- మెదక్ జిల్లాలో 49, సంగారెడ్డి జిల్లాలో 100, సిద్దిపేట జిల్లాలో 93 దుకాణాల  కేటాయింపు

- సంగారెడ్డి జిల్లాలో ఒక దుకాణానికి రీ నోటిఫికేషన్

సంగారెడ్డి/ సిద్దిపేట/ మెదక్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) :మద్యం దుకాణాల లై సెన్సుల జారీ కోసం సోమవారం ఉమ్మడి జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో మొత్తం 242 మద్యం దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటా యించారు. సంగారెడ్డి జిల్లాలోని షాప్ నం బర్ 24కు తక్కవు దరఖాస్తులు వచ్చినందున రీ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. క ట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రి య కొనసాగింది. నూతన ఎక్సయిజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎ లాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లాలోని 49 మద్యం షాపులకు గాను మొత్తం 1420 దరఖాస్తులు దాఖలయ్యాయి.

ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ రాహుల్ రాజ్ లక్కీ డ్రా తీస్తూ మ ద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందులో రిజర్వేషన్ ప్రాతిపదికలో భాగంగా గాను ఎస్టీ -01, ఎస్సీ-06 , గౌడ కులానికి సంబంధించి-09 మొ త్తం 16 షాపులు కేటాయించామన్నారు, మిగతా 33 షాపులు అన్ రిజర్వ్ కింద కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో 18 షాపులకు మహిళలు లాటరీ గెలుచుకోగా, 31 షాపులకు పురుషులు దక్కించుకోవడం జరిగిందన్నారు. మద్యం టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందన్నారు. 

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీ ణ్య సమక్షంలో మద్యం దుకాణాల కేటాయింపు డ్రా పద్దతిలో కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 101 దుకాణాలకు గాను 4,432 దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే సోమవారం 100 దుకాణాలు మాత్రమే కేటాయించారు. షాపు నంబర్ 24కు సం బంధించి తక్కువ దరఖాస్తులు అందినందున ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు రీ నోటిఫి కేషన్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కాగా జిల్లాలో ఎస్టీ 2, ఎస్సీ 13, 9 గౌడలకు, 77 ఓపెన్ కేటగిరిలో దుకాణాలను కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. 

సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట జిల్లాలో 93 మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయడం జరిగింది. మొత్తం 93 దుకాణాలకు గాను 2,782 దరఖాస్తులు వచ్చాయి. కాగా జిల్లాలో ఎస్సీలకు 9, గౌడ కులస్థులకు 16, ఓపెన్ కేటగిరి కింద 68 దుకాణాలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్మూర్తి, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.