calender_icon.png 28 October, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనత్‌నగర్‌లో మల్టీ-స్పెషాలిటీ హెల్త్ స్క్రీనింగ్

28-10-2025 12:43:13 AM

ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శిబిరం

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లోని అల్లావుద్దీన్ కో టి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్‌లో సోమవారం మల్టీ-స్పెషాలిటీ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ విభా గాలకు చెందిన నిపుణ వైద్యులు పాల్గొన్నారు.

పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ వైద్య సలహాలు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్,  గౌరవ అతిథిగా కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, పాల్గొన్నారు.  ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ.. “సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపర చడం, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో మేము కట్టుబడి ఉన్నా’ అని పేర్కొన్నారు.