28-10-2025 12:45:22 AM
శ్రీశైలం యాదవ్, రమేష్‌యాదవ్‌తో పాటు 170 మంది రౌడీ షీటర్లు కూడా..
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, తండ్రి సోదరుడు రమేష్‌యాదవ్‌తో పాటు, నియోజకవర్గ పరిధిలోని 170 మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బైండోవర్ ప్రక్రియను చేపడతారు. గతంలో నేర చరిత్ర ఉన్నవారు, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయగలరని భావించే వారి కదలికలపై నిఘా ఉంచుతారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల సమయంలో అ త్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా పోలీసులు పరిగణిస్తున్నారు.
ఈ నేపథ్యం లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుం టున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాం గ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి, బాబాయ్‌ని బైండోవర్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ఎలాంటి కార్యకలా పాలకు పాల్పడరాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని పోలీసులు వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
నియో జకవర్గంలో వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని 170 మంది రౌడీ షీటర్ల జాబితాను సిద్ధం చేసిన పోలీసులు, వారందరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేశా రు. ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి గొడవలకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని వారి నుంచి హామీ పత్రం బాండ్ తీసుకున్నారు.