16 April, 2026 | 9:04 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

గుర్తుల కేటాయింపు పారదర్శకంగా జరగాలి

03-02-2026 12:38 PM

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. అభ్యర్థుల క్రమ సంఖ్య తెలుగు అక్షరమాల క్రమానుసారమే ఉండేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్, వార్డుల వారీగా దాఖలైన నామినేషన్ల జాబితాలను పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తుల కేటాయింపు జరగాలని స్పష్టం చేశారు.

నామినేషన్ ఉపసంహరణకు అభ్యర్థులు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని, ప్రతినిధుల ద్వారా సమర్పించిన పత్రాల విషయంలో తప్పనిసరిగా అభ్యర్థితో నిర్ధారణ చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ పార్టీల అభ్యర్థుల బీ-ఫారమ్‌లను పరిశీలించి, ఫారం–ఏ ఆధారంగా సమర్పించారా లేదా అని తెలుసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉందని, ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తహసిల్దార్ తబితా రాణి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.