16 April, 2026 | 8:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అతివేగంతో కారు బోల్తా.!

03-02-2026 12:36 PM

ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మితిమీరిన వేగం కారణంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కారు బోల్తా కొట్టిన ఘటనలో కారు డ్రైవర్తోపాటు ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) తాడూరు మండలం అల్లాపూర్ గేట్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.

స్థానికులు గమనించి వెంటనే 108 సాయంతో గాయపడిన వారిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి లింగంపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారు కల్వకుర్తి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.