1 July, 2026 | 8:51 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

గత చిత్రాలను మించి అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా

01-01-2025 12:00 AM

‘పుష్ప 2’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రంపై అంచనాలు భారీగానే ఉంటాయనడంలో సందేహం లేదు. అయి తే తదుపరి చిత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంటుంది. ఆయన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో గతంలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి.

అల్లు అర్జున్ నాలుగో చిత్రం పాన్ ఇండి యా స్థాయిలో తెరకెక్కనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ వివరాలను నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ‘డాకు మహారాజ్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాగవంశీ తాజాగా అల్లు అర్జున్  త్రివిక్రమ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన గెటప్ ఎలా ఉండాల నే దానిపై త్రివిక్రమ్‌తో కూర్చొని ఫైనల్ చేయనున్నారట.

ఈ ప్రాజెక్ట్ ‘పుష్ప2’కి ఏమాత్రం తీసిపోదని నాగవంశీ తెలిపారు. అంతేకాకుండా కథ గత చిత్రాలను మించేలా ఉంటుందన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఒక స్టూడియోను సైతం నిర్మిస్తున్నట్టు తెలిపారు.

ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్ కీలకమన్నారు. పాన్ ఇండియా స్థాయిలో త్రివిక్రమ్‌కు ఇది తొలి సినిమా కావడంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌ను సిద్ధం చేశారని నాగవంశీ తెలిపారు. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయ ని.. జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. 2025 మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారని నాగవంశీ వెల్లడించారు.