1 July, 2026 | 9:56 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పోకిరి నుంచి నా గుండె జారిపోయిందే

01-01-2025 12:00 AM

వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణంలో, ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘పోకిరి’. వికాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మమ హీరోయిన్‌గా నటిస్తోంది. మంగళవారం వరుణ్ రాజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘పోకిరి’ నుంచి మొదటి పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ మమత మాట్లాడుతూ.. “ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీయన్స్. డైరెక్టర్ వికాస్‌కి, వరుణ్ కి థ్యాంక్స్.

ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీ గుర్తొస్తుంది. అందరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నా” అన్నారు. డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ.. “మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం.

ఈ సినిమా బాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాం” అన్నారు. హీరో, నిర్మాత వరుణ్ రాజ్ మాట్లాడుతూ “ఈ సినిమాతో మంచి హిట్ కొడతాం. నేను పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేశ్‌బాబు అభిమానిని. ఈ సినిమా టైటిల్‌లోనే దమ్ముంది. ‘పోకిరి’కి ఓనర్ మహేష్ బాబే. మేమంతా అభిమానులం అంతే” అన్నారు.