1 July, 2026 | 7:40 PM

Breaking News

కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •  

సీతా ఔర్ గీతాకు రీమేక్‌గా..

31-12-2024 11:40 PM

వి. రామచంద్రరావు, తాపీ చాణక్యల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గంగ మంగ’. ఈ సినిమా 1973 జనవరి 1న విడుదలైంది. హిందీలో వచ్చిన ‘సీతా ఔర్ గీతా’ అనే సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. శోభన్‌బాబు, కృష్ణ, వాణిశ్రీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించా రు. శ్రీవాణి ద్విపాత్రాభినయం చేశారు.

చిన్నతనంలోనే తల్లిదండ్రు లను కోల్పోయిన గంగ.. భారీ ఆస్తికి వారసురాలు. ఆమె తన మామ, అత్తతో కలిసి నివ సిస్తూ ఉంటుంది. చాలా అమాయకురాలు, పిరికి అమ్మాయి. ప్రతి నెలా వారి కుటుంబ న్యాయవాది వారి ఇంటికి వచ్చి గంగకు కొంత డబ్బు అందజేస్తాడు. కానీ గంగ అత్త దుర్గ దానిని బలవంతంగా తీసుకుని ఇంటి పనంతా చేయిస్తూ ఉంటుంది.

మరోవై పు మంగ చిన్న గుడిసెలో తల్లితో కలిసి జీవిస్తూ ఉంటుంది. చాలా చలాకీగా సంతోషకరమైన జీవితాన్ని మంగ గడుపుతూ ఉంటుంది. వీధిలో మేజిక్ చేస్తూ చాలా సంతోషంగా జీవనం సాగిస్తుంది. ఇలా రెండు విభిన్న ప్రాంతాల్లో విభిన్న పరిస్థితుల మధ్య ఒకే పోలికతో పెరుగుతున్న ఇద్దరు అమ్మాయిల కథ ఆ తరువాత ఎలాంటి మలుపు తీసుకుందనేది చిత్ర కథాంశం.