calender_icon.png 10 October, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యంతో పాటు మనసూ ముఖ్యమే

10-10-2025 12:18:08 AM

  1. కిమ్స్ హాస్పిటల్స్ సైకియాట్రిస్ట్ డాక్టర్ చరణ్ తేజ కొగంటి
  2. నేడు మానసిక ఆరోగ్య దినోత్సవం

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని డాక్టర్ చరణ్ తేజ కొగంటి (కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్) అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం సంద ర్భంగా ఆయన మాట్లాడారు. “మనిషి జీవన మనగడ మొత్తం మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో... అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత మనసకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ సంవత్సరం  ‘సేవలందుబాటు విపత్తులు, అత్యవసరాల్లో మానసిక ఆరోగ్యం’ అనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నారు. విపత్తులు సంభవించినప్పుడు యుద్ధం, వరదలు, మహమ్మారి లేదా రాజకీయ కలతలు అయినా మనం ప్రధానంగా జరిగిన నష్టా న్ని మాత్రమే గమనిస్తాం. మానసిక ఆరోగ్యం అనేది విపత్తుల సమయంలో కనిపించని బాధితుడిగా మిగులుతుంది. ఆహారం, మందులు, ఆశ్రయం కానీ మానసిక గాయా లు కనిపించకుండానే మిగిలిపోతాయి.

ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడు తున్నవారికి చికిత్స అందకపోవడం వలన పరిస్థితి మరింత క్షీణించుతుం ది. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం, ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక సహాయం అవస రం. అత్యవసర పరిస్థితుల్లో ఈ అంతరం మరింత పెరుగుతుంది. ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న రాజకీయ మరియు సామాజిక ఉద్రిక్తత నేపథ్యంలో, మానసిక ఆందోళన గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.

కాబట్టి, మానసిక ఆరోగ్య సేవలు సంఘాధారిత కార్యక్రమాలు, హెల్ప్‌లైన్లు, లేదా సైకాలజికల్ ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ ఎంచుకునే అంశాలు కావు” అన్నారు. మానసిక ఆరోగ్యానికి పలు సూచనలు చేశారు. మొదటి స్పందకులకు సైకాల జికల్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇవ్వడం, అత్యవసర పరిస్థితుల్లో మా నసిక వ్యాధులకు మం దుల నిరంతరతను నిర్ధారించడం, దూరప్రాంతాలు, నిర్వాసితుల వరకు చేరేలా టెలి-మెం టల్ హెల్త్ సేవలను విస్తరించడం, విపత్తు నిర్వహణ బృందాల్లో మానసిక ఆరోగ్య నిపుణులను చేర్చాలన్నారు.