28 February, 2026 | 1:59 PM

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే వన్ హెల్త్ ఫార్మసీ ఏర్పాటు

28-02-2026 12:13 PM

మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే భావనతో వన్ హెల్త్ ఫార్మసీ(One Health Pharmacy)ని ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medchal MLA Chamakura Mallareddy) అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలో మల్లారెడ్డి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వన్ హెల్త్ ఫార్మసీ ని ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో మల్లారెడ్డి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 100 అంబులెన్స్ లు తీసుకు వస్తున్నామని, మార్చి 5న 20 అంబులెన్సులు ప్రారంభించడం జరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం మొత్తం మెడికల్ షాపులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. వన్ హెల్త్ ఫార్మసీ ద్వారా అందించే సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, కొమ్మగోని రమాదేవి, బండారి ఆంజనేయులు గౌడ్, జహంగీర్, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగరావు, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, రైతు సొసైటీ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, నాయకులు మారం లక్ష్మారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, పోత్నకని మల్లికార్జున రాజు తదితరులు పాల్గొన్నారు.