8 April, 2026 | 8:08 PM

నిజామాబాద్‌లో ఆల్ప్రాజోలం పట్టివేత

07-05-2024 01:35 AM

ఐదుగురు అరెస్ట్

నిజామాబాద్, మే 6 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కల్లులో కలిపే నిషేధిత ఆల్ప్రాజోలం, క్లోరల్ హైడ్రెట్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకొని ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి 2.32 కేజీల ఆల్ప్రాజోలం, 530 గ్రాముల క్లోరల్ హైడ్రెట్, 4 ద్విచక్ర వాహనాలు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లాలో కొందరు నిషేధిత మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో మూడు టీమ్‌లుగా ఏర్పడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆల్ప్రాజోలం, క్లోరల్ హైడ్రెట్‌ను విక్రయిస్తున్న 8 మంది సభ్యుల ముఠాను గుర్తించిన ఎక్సైజ్ అధికారులు, వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.