ఈ నెల 10న హైదరాబాద్‌కు మోదీ
07-05-2024 01:36 AM
కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. 2014కు ముందు దేశంలో నిత్యం అల్లర్లు జరిగేవని, ఉగ్రదాడులతో పరిస్థితి భయంకరంగా ఉండేదన్నారు. హైదరాబాద్‌లోనూ మత ఘర్షణలు, బాంబు పేలుళ్లు జరిగేవన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారన్నారు. పదేళ్లలో మోదీ చేసిన అభివృద్ధి పనులపై ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్ పాల్గొన్నారు.




