18 May, 2026 | 4:14 PM

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

18-05-2026 02:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో( Sri Saraswathi Shishu Mandir High School) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. 2009 - 2010 బ్యాచ్ కు చెందిన సుమారు 100 మంది 16 సంవత్సరాల తర్వాత విద్యార్థులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించారు.. పదవ తరగతి తర్వాత ఎక్కడెక్కడో ఉన్నత చదువులు ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన విద్యార్థులందరూ ఒక్క చోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.. అనంతరం గురువులతో కలసి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు... ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆచార్యులు పాల్గొన్నారు.