15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం

10-11-2025 12:59 AM

చిట్యాల, నవంబర్ 9(విజయ క్రాంతి):  నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2015, 16 విద్యాసంవత్సరం నుండి 2024%--%25 వరకు చదువుకున్న పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం ఆదివారం స్థానిక రైతు వేదికలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు చెన్నూరు నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈసమావేశంలో గ్రామస్తులు, నాయకులు, యువకులు, పూర్వ విద్యార్థులు హాజరై విద్యార్థులు, యువతకు ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని చర్చించి నిర్ణయించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసి, స్వయం ఉపాధి లేదా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలను పొందేలా కృషి చేయడం, ఇందుకోసం ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ ద్వారా సహకారం అందించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉన్నత చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు మార్గనిర్దేశనం, చదువు ఆపేసిన పూర్వ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని సమిష్టిగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల హెఎం రమాదేవి, ఉపాధ్యాయుడు వెంకట్ రావు, పలువురు గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.