24 August, 2026 | 10:22 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

ఆమనగల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

28-06-2025 12:58 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

ఆమనగల్లు, జూన్ 27 : కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్లు మున్సిపాలిటీ రంగాలలో అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామినిచ్చారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఆమనగల్ మార్కెట్ యార్డు ఆవరణలో ఏఎంసి నిధుల నుండి రూ. 65 లక్ష లతో నిర్మించిన 8 వ్యాపార సముదాయదు కాణలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్ పర్స న్ గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, కమిటీ పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ గత పాలకుల చేతుల్లో అభివృద్ధికి ఆమనగల్ ఆమడ దూరంలో మార్కెట్లో కనీస వసతి సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు గురైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్కు మరిన్ని నిధులు తీసుకొ చ్చి మోడరన్ మార్కెట్ ను నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తానని ఆయ న చెప్పారు. గతంలో కూడా ఎన్నికల ముం దు, ఎన్నికల తరువాత పర్యటించిన క్రమం లో నా దృష్టికి వచ్చిన అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ, విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశానని తెలిపారు.

పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా ముందుకు వెళ్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు హామలు చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. గతంలో ఆమనగల్లు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడిందని గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా ప్రాంతం వెనుకబడిందన్నారు.

ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి త్వరలో అందుబాటులు తీసుకొస్తామని, మున్సిపా లి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే మంజూరు చేశామని, క లబ్ధిదారులు ఉంటే వారికి కూడా మంజూరు చేస్తానని ఆయన హామీని ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకోవాలని ఆ యన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ సభ్యులు కండె రంగయ్య, వ స్పుల శ్రీశైలం, యాదయ్య గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ కేశవరెడ్డి, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, బాలాజీ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ నిట్ట నారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల తాలూకా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తెల్గ మల్ల జగన్, శ్రీనివాస్, కండె సాయి, గుర్రం కేశవులు, సుమన్, కరీం, ఖలీల్, పరమేష్, ఫరీద్, అలీమ్, రఫీ, సత్యం, సురేష్, షాబుద్దీన్, దారెడ్డి అంజన్ రెడ్డి, ధనుంజయ, రాజు, ప్రసాద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ యార్డు సిబ్బంది తదితరుల పాల్గొన్నారు.