21 July, 2026 | 11:08 AM

స్పెయిన్ అద్బుత:

21-07-2026 12:00 AM

* సాకర్ ప్రపంచకప్‌కు అసలైన ముగింపు...ఊహించినట్టుగానే ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ మధ్య హోరాహోరీ పోరు యుద్ధాన్నే తలపించింది. నిర్ణీత సమయంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదంటే మ్యాచ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు మ్యాచ్ ఫలితం అదనపు సమయంలోనే తేలింది. కానీ అర్జెంటీనాకు షాకిస్తూ స్పెయిన్ టైటిల్ ఎగరేసుకుపోయింది.

అందరూ ఊహించినట్టుగానే టికీ టాకా వ్యూహంతో అర్జెంటీనాను స్పెయిన్ కట్టడి చేసింది. మెస్సీకి సైతం కనీసం బంతిని ఎక్కువసార్లు టచ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదంటే వారి ఢిఫెన్స్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా టోరెస్ చేసిన గోల్‌తో స్పెయిన్ 16 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా రెండోసారి ట్రోఫీ అందుకోవాలనుకున్న కల చెదరడంతో మెస్సీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

  1. ఫుట్‌బాల్ ప్రపంచకప్ కైవసం
  2. ఫైనల్లో అర్జెంటీనాకు షాక్
  3. టికీ టాకా వ్యూహంతో అదుర్స్
  4. టైటిల్ పోరులో తేలిపోయిన మెస్సీ

న్యూయార్క్, జూలై 20 : వరుసగా రెండో సారి వరల్ కప్ గెలవాలనుకున్న అ ర్జెంటీనా ఆశలు నెరవేరలేదు. ఫైనల్లో స్పెయిన్ 1--0 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. న్యూజెర్సీ లోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ ఫైన ల్లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి.దీంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఆ తర్వాత 106వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఫెర్రాన్ టొర్రెస్ అద్భుతమైన గోల్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

స్పెయిన్‌కు ఇది రెండో ప్రపం చ కప్ టైటిల్.గతంలో ఆ జట్టు 2010లో వరల్డ్ కప్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఊహించినట్టుగానే మరోసారి అద్భుతమైన టికీ- టాకా వ్యూహంతోనే స్పెయిన్‌పై చేయి సాధించింది. మ్యాచ్ ఆద్యంతం స్పెయిన్ బం తిని తమ ఆధీనంలో ఉంచుకుంటూ అర్జెంటీనాను ఒత్తిడికి గురిచేసింది. దాదాపు 20 షాట్లతో స్పెయిన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అర్జెంటీనా ఆటగాళ్లకు బంతిని ఎక్కువసేపు దక్కనివ్వకుండా అద్భుతమైన పాసింగ్ గేమ్‌ను ప్రదర్శించింది.

ముఖ్యంగా లియోనెల్ మెస్సీని కట్టడి చేయడంలో పూర్తి గా సక్సెస్ అయింది.స్పెయిన్ డిఫెండర్లు మెస్సీని సమర్థవంతంగా అడ్డుకున్నారు. దీనివల్ల మెస్సీకి చాలా తక్కువ అవకాశాలు ల భించాయి. నిజానికి ఆఈ టోర్నీ అంతటా స్పెయిన్ రక్షణ విభాగం చాలా పటిష్టంగా పనిచేసింది. ఫైనల్లో కూడా వారి డిఫెన్స్‌ను ఛేదించడం అర్జెంటీనా వల్ల కాలేదు. ప్రత్యర్థులకు గోల్స్ చేసే అవకాశాలను స్పెయిన్ డి ఫెండర్లు చాలా వరకు అడ్డుకున్నారు.

అర్జెంటీనా ఎంత దూకుడుగా ఆడేందుకు ప్రయ త్నించినా స్పెయిన్ డిఫెన్స్ ను చేధించలేకపోయారు. చివర్లో ఫెర్రాన్ టోరెస్ హీరోయిజం హైలైట్ గా నిలిచింది.నిర్ణీత సమయంలో ఏ జట్టు గోల్ చేయలేకపోవడంతో 106వ నిమిషంలోఫెర్రాన్ టోరెస్ కొట్టిన ఏకైక గోల్ స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. అలాగే ఈ మ్యాచ్‌లో కొన్ని పొరపాట్లు అర్జెంటీనా ఓటమికి కారణమయ్యాయి.

స్పెయిన్ చేసిన నిరంతర దాడుల ను అడ్డుకోవడంలో అర్జెంటీనా డిఫెన్స్ చివరి వరకు ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ కు గురై మైదానం వీడటంతో, స్పెయిన్ ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది.

అదనపు సమయంలో అర్జెంటీనా పది మందితోనే ఆ డాల్సి రావడం కొంపముంచింది.గత యూ రో 2024 విజయంతో ఊపుమీదున్న స్పె యిన్.. అదే సమష్టి తత్వంతో, ఎలాంటి తడబాటు లేకుండా ప్రపంచ కప్‌ను సొంతం చే సుకుంది. ట్రోఫీతో పాటు రూ.481 కోట్ల ప్రై జ్‌మనీ అందుకుంది. అర్జెంటీనాకు రూ.315 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.