ఇదే చివరి ప్రపంచకప్
- మెస్సీ శకం ముగిసినట్టే
- రెండో ప్రపంచకప్ కల నెరవేరని మెస్సీ
- ఓటమి తర్వాత కన్నీటి పర్యంతం
న్యూయార్క్, జూలై 20 : అర్జెంటీనా సాకర్ దిగ్గజం చివరి ప్రపంచకప్ ఆడేశాడు. టోర్నీకి ముందే ప్రకటించినట్టు మరో ఫిఫా ప్రపంచక ప్‌లో అతను మళ్లీ కనిపించే అవకాశం లేదు. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్ ముద్దాడాలనుకున్న కల నెరవేరకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. మెస్సీని అలా చూసిన అభిమానులు తట్టుకోలేకపోయా రు. నిజానికి సాకర్ ప్రపంచం లో స్టార్ ప్లేయర్స్ రొనాల్డో, నెయ్ మార్ వంటి ప్లేయర్స్‌కు సాధ్యం కాని ప్రపంచకప్ కల ను మెస్సీ 2022లోనే నెరవేర్చుకున్నాడు.
ఈ సారి 2026 ప్రపంచకప్ ఫైనల్లో మరోసారి కన మ్యాజిక్ రిపీట్ చేద్దామని అనుకున్నా స్పెయిన్ ముం దు అతను తలవంచక తప్పలేదు. కానీ అర్జెంటీనాకే కాదు ఫుట్‌బాల్ ప్రపంచం చూసిన అత్యుత్తమ ప్లేయర్స్‌లో మెస్సీ ఎప్పటికీ నిలిచిపోతాడు. ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్లో ఓట మి తీవ్ర నిరాశకు గురి చేసినా మెస్సీ తన రిటైర్మెంట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అలా అని అతను వచ్చే ప్రపంచకప్ ఆడే అ వకాశాలు లేవు. ఎందుకంటే ఈ టోర్నమెంట్‌కు ముందే తనకు ఇదే చివరి వరల్డ్‌కప్‌గా అతను ప్రకటించాడు.
నిజానికి మెస్సీ గతంలోనే రిటై ర్మెంట్ ప్రకటించి వెనక్కి తీసుకున్నాడు. 2016 కోపా అమె రికా ఫైనల్స్‌లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. వరుసగా మూడు ప్రధాన ఫైనల్స్ ఓడిపోవడం తో బాగా ఎమోషనల్ అయ్యి రిటైర్మెంట్ ప్రకటించాడు. అ యితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మం ది అభిమానులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు, దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా సైతం రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని బలంగా కోరడంతో తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు.
ఒక విధంగా ఈ నిర్ణ యం మెస్సీ కెరీర్‌కు మరో మలుపుగానే చెప్పాలి. రీ ఎంట్రీలో మెస్సీ రాణించిన తీరు అద్భుతమనే చెప్పాలి. తన అద్భుతమైన ఆటతో అర్జెంటీనాకు 2022 ఫిఫా వరల్డ్‌కప్ అందిచాడు. అలాగే 2021, 2024లో కోపా అ మెరికా ట్రోఫీలను తన దేశానికి అందించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లోనూ అదరగొ ట్టి జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఈ ఓటమి తర్వాత మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. ఏది ఏమై నా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఓ గొప్ప ఆటగాడి శకానికి తెరపడినట్టే.






