06-12-2025 09:36:56 PM
తుర్కయంజాల్: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు ప్రపంచానికే దిక్సూచిగా నిలిచాయని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీజీ కాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఆఫీసు ఆవరణలో ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చెక్క బాల నర్సింహ, జనరల్ సెక్రటరీ గుడ్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఖానాపురం దాసు, బీజేపీ రాష్ట్ర నాయకులు బచ్చిగళ్ల రమేష్, మాజీ వార్డు సభ్యుడు గుండా బాలరాజు, మైనార్టీ నాయకులు ఫైసల్, నాయకులు కొత్తకుర్మ శ్రీశైలం, మేతరి శంకర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.