calender_icon.png 6 December, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి

06-12-2025 09:34:21 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లగోల్ల అశోక్ యాదవ్ 

మొయినాబాద్,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లగోల్ల అశోక్ యాదవ్ అన్నారు. శనివారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ కూడలి లోగల అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటన, సమన్యాయాన్ని రాజ్యాంగంలో పొందపరిచిన భారత పిత అని కొనియాడారు. సమాజంలోని అసమానతలను రూపు మాపడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, మహిళ హక్కుల కోసం తన పదవిని త్యాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుశాంగల నందు, దేవులపల్లి సంతోష్ గౌడ్, బుర్రకాయల లింగం, వెంకటేష్ గౌడ్ అత్తపురం సదానందంగౌడ్, బైకని మల్లేష్ యాదవ్, ఫైలు శ్రీదర్, కుశాంగల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.