calender_icon.png 6 December, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ప్రశాంతత కోసం పోలీసుల ఫ్లాగ్ మార్చ్..

06-12-2025 09:40:32 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో  తాళ్ళగురిజాల పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడారు.స్వేచ్ఛయుత వాతావరణలో ప్రంశాంతంగా జరగాలన్నారు. ఎన్నికల్లో శాంతి భద్రత కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రవెల్లి, చాకెపల్లి, బుధకూర్డ్  గ్రామాలలో  ఏసీసీ ఏ రవికుమార్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ప్లాగ్ మార్చ్ లో  అధికారులు, సిబ్బందితో కలిసి ముఖ్యమైన రహదారులు, గ్రామాలలోని వాడలలో పోలీసు బృందాలు కవాతు ప్రజలకు బరోస నింపింది.

పోలీస్ లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే నమ్మకం, చట్టం, శాంతి భద్రతపై భరోసా కల్పించాయి. ఈ  ఎన్నికల లో ఎలాంటి అక్రమాలు, డబ్బు పంపిణీలు, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రత కాపాడేందుకు ప్రత్యేకంగా ప్లాగ్ మార్చ్, పెట్రోలింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఓటు విలువైనది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అన్ని రకాల పటిష్టమైన భద్రత పరమైన బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం బెల్లంపల్లిరూరల్ సీఐ హనోక్, బెల్లంపల్లి సీఐ శ్రీనివాస్రావు, బెల్లంపల్లిటూటౌన్, నెన్నెల్, తాళ్ళగురిజాల ఎస్ఐ లు 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.