06-12-2025 10:45:03 PM
మాగనూరు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి మాగనూరు మండల కేంద్రంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని 167వ జాతీయ రహదారి పక్కన ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తూ వారిని స్ఫూర్తిగా యువకులు పనిచేసే దేశ సమిష్టికి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రమేష్, సిపిఎం నాయకులు ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు ఆనంద్ గౌడు, దండు సత్యప్ప, బిజెపి నాయకులు అశోక్ గౌడ్, రాంగోపాల్ శెట్టి, వివిధ పార్టీల నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.