06-12-2025 10:42:36 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట (విజయక్రాంతి): పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. శనివారం పాపన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి విద్యా సామర్థ్యాలను పరీక్షించిన అనతరం పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు పటిష్ట ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుని పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.