06-12-2025 09:23:50 PM
ముకరంపుర,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మంకమ్మ తోటలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ... బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల కొరకు అంటరానితనికి వ్యతిరేకంగా, మహిళా స్వేచ్ఛ కొరకు, కుల నిర్మూలన కొరకు మనస్ఫృతికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కాంపల్లి అరవింద్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్, కండె రాజు, పులిపాక సాయికుమార్, దాసరి కనకేష్, ఆసం పెళ్లి వినయ్ సాగర్, కాదశి కుమార్ పాల్గొన్నారు.