calender_icon.png 6 December, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

06-12-2025 09:30:22 PM

మంచిర్యాల ఏసీపీ ప్రకాష్

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహణకు ముఖ్యఅతిథులుగా మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పోలీస్ అధికారులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ...ఈ ఫ్లాగ్ మార్చ్ తో ప్రజల్లో నమ్మకం పెంపొందించడం, శాంతి భద్రతలు కాపాడడం ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడమే లక్ష్యంగా నిర్వహించడం జరిగిందన్నారు.

ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి  సహకరించి, ఎన్నికల నియమాలను పాటించి, మీ గ్రామాల్లో చట్ట వ్యతిరేకమైన, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం, గొడవలకు పాల్పడడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపతంగా, శాంతియుత ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉండాలని తెలియజేశారు.