15 April, 2026 | 3:08 AM

అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తి కావాలి

15-04-2026 12:19 AM

కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు 

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 14 ,(విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్, సమానత్వానికి పునాది భారత రాజ్యాంగం అంటూ ఎస్పి రోహిత్ రాజ్ ఉద్బోధించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ ప్రధాన కూడలిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజలు స్వయంగా పరిపాలించుకునే విధంగా రాజ్యాంగం అవసరమైందని, దేశ వ్యాప్తంగా అనేక మంది మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగల వ్యక్తిగా గుర్తించబడినట్లు తెలిపారు.     కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్   కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్, వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ మద్దెల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.