15 April, 2026 | 3:16 AM

ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం

15-04-2026 12:17 AM

పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు

హైదరాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): శ్రీ లక్ష్మీనరసింహస్వామి 18వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహిం చిన స్వామివారి కళ్యాణోత్సవంలో భారతీయ హిందూ పరిషత్ మాతృశక్తి విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సింగం బాను, మేడ్చల్ మల్కాజిగిరి అధ్యక్షురాలు స్వప్న మోనారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి వారు దర్శనం చేసుకుని, స్వామివారి సేవ లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణం లో జరిగిన ఈ మహోత్సవం భక్తులతో కళకళలాడింది.