కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 12:54 PM
కూసుమంచి, (విజయ క్రాంతి): భారత రాజ్యాంగ శిల్పి, మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపించిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత వంటి మహోన్నత ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు కొండ కృష్ణవేణి మహిపాల్, వడిత్య వెంకటేష్ నాయక్, హాలావత్ వీరియా,డిసిసి ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హఫీజ్, ఉపాధ్యక్షుడు మంకెన వాసు,EC నెంబర్ మెంబర్ బానోత్ వినోద, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ప్రతిజ్ఞ చేశారు.




