నిండిన చెరువులు.. చేపల వేటలో యువకులు
31-07-2026 09:08 AM
ఉట్నూర్, జులై 31 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు,కుంటలు, చిన్న చిన్న ప్రాజెక్టులు నిండిపోయాయి. చెరువులు, ప్రాజెక్టుల లో వర్షం నీరు బయటకు ప్రవహించడంతో ఆయా గ్రామాల్లో యువకులు దోమతెరలతో చేపలను పడుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ లోని త్రివేణి సంగమం ప్రాజెక్టు నిండి వర్షం నీరు బయటకు ప్రవహించడంతో చుట్టు గ్రామాల గిరిజనులు శుక్రవారం ఉదయం చేరుకొని చేపలు పట్టారు. ప్రాజెక్టులోని నీరు నిండి వర్షం నీరు బయటకు రావడంతో 5 కేజీల నుండి 15 కేజీల చేపల ను దోమతెరల తో పట్టుకున్నారు.






