అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం
మానకొండూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
మానకొండూరు,(విజయక్రాంతి): మానకొండూర్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన కృషిని కొనియాడుతూ... ఆయన ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.
బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకు అంబేద్కర్ చేసిన సేవలు అపారమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షులు కంది రాజిరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు, ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్, నాయకులు సోన్నాకుల శ్రీనివాస్, కత్తి ప్రభాకర్ గౌడ్, శీలం కుమార్ 2వ వార్డు మెంబర్ భాషబోయిన ప్రదీప్ యాదవ్, మార్కొండ రమేష్ పటేల్,కోండ్ర సురేష్, ఆరేపల్లి సునంద్, కొండ్ర వరప్రసాద్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






