15 April, 2026 | 3:16 AM

ఘనంగా అంబేద్కర్ జయంతి

15-04-2026 12:12 AM

రెసోనెన్స్ విద్యా సంస్థల్లో నిర్వహణ  

హైదరాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): మాదాపూర్‌లోని రెసోనెన్స్ కాలేజీ క్యాంపస్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో విద్యా ర్థులు, అధ్యాపకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమానికి సంస్థ రెసోనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా, సీఓఓ మార్కండేయ, జీఎం మల్లేష్, ఇతర అధ్యాపకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రెసోనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లా డుతూ ‘డాక్టర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆలోచనలు నేటి యువతకు ఎంతో ప్రేరణనిస్తాయని తెలిపారు. సమాజంలో సమానత్వం, విద్య ప్రాముఖ్యతపై ఆయన చేసిన కృషిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచిం చారు’.అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రేరణాత్మకంగా సాగి, అందరిలోనూ సామాజిక బాధ్యత, సమానత్వ భావనను మరింత బలపరిచింది.