అంబేద్కర్ విగ్రహాన్ని ఆదరించే వారే లేరా
కేవలం జయంతి, వర్ధంతిలకే
అంకితం అయిన అంబేద్కరుడు
శనిగరం తరుణ్ కుమార్
అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోనీ మేజర్ గ్రామ పంచాయతీ అయిన చెల్పూర్ గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆదరించే వారు లేకుండా పోయారని. అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు శనిగరపు తరుణ్ కుమార్ శుక్రవారం ఆవేద వ్యక్తం చేశారు. చల్పూర్ గ్రామ స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్ల విగ్రహాన్ని సుందరీకరణ జరగడం లేదని, గత కొన్ని ఏళ్లుగా స్థానిక గ్రామ యువకులు ముందుకు వచ్చి పని చేద్దాం.
చూసిన స్థానిక నాయకుల వచ్చి గొడవ పడి పనులు జరగకుండా ఆపి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద గ్రామంలో ఎంతో మంది మేధావులు ఉన్న కూడా అంబేద్కరుడిని అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా గ్రామపంచాయతీ పలకవర్గం అయిన ఈ ఏడాది వచ్చే జయంతీ వరకు అయన విగ్రహ పనులు పూర్తి చెయ్యాలి అని డిమాండ్ చేశారు.




