calender_icon.png 21 February, 2026 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ట్యాంక్‌బండ్ అభివృద్ధి చేయాలి

21-02-2026 02:27:12 AM

నిర్మల్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ ట్యాంక్ బండ్‌ను అభివృద్ధిని చేయాలని దళిత సంఘాల జేఏసీ శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తికి వినతి పత్రం అందజేశారు. కాంస్య విగ్రహం ఏర్పాటుచేసి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకులు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

కుంటోల్ల వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఈరోల పురుషోత్తం, సలహాదారులు బొడ్డు లక్ష్మణ్, ఎలుమల రాజేశ్వర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు వెలుమల ప్రభాకర్, దళిత సేన జిల్లా కన్వీనర్ గడ్డం శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ హక్కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.