6 May, 2026 | 3:26 PM

మిరాయ్‌లో అంబికగా..

03-09-2025 12:42 AM

తేజ సజ్జా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రియ శరణ్ పవర్ ఫుల్ మదర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా శ్రియను అంబికగా పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ ఎమోషన్‌తో ఉంటుందని టీమ్ పేర్కొంది. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీనాగేంద్ర తంగాల పనిచేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.