03-09-2025 12:43:49 AM
సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. బాలీవుడ్ నిర్మాత ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సోనాక్షి సిన్హా, శిల్పా శిరో ద్కర్, ఇందిరా కృష్ణ, రవిప్రకాశ్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్ ముఖ్య పాత్రల్ని పోషించారు.
ఈ చిత్రబృందం ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశా యి. తాజాగా ఈ సినిమా నుంచి శిల్పా శిరోద్కర్ పోషించిన పాత్రకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ పంచు కున్నారు. ‘ఖుదా గవా’, ‘మత్యుదంద్’ వంటి చిత్రాల్లో అద్భుతమై న నటనతో అందరినీ ఆకట్టుకున్న శిల్పా శిరోద్కర్ ‘జటాధర’ చిత్రంలోని పర్ఫామెన్స్‌తో అవార్డులన్నీ గెలిచేస్తారని ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా అన్నారు.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. “జటాధర’లో శోభ పాత్రలో నటించిన శిల్పా శిరోద్కర్‌కు అన్ని అవార్డులు వస్తాయని ఎంతో నమ్మకంగా చెబుతున్నా. శోభ ఒక శక్తిమంతమైన, సంక్లిష్టమైన పాత్ర. ఈ పాత్రకు ఆమె తన నటనతో ఎంతో బలాన్ని చేకూర్చి, న్యాయం చేశారు. ఆమె ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది” అని అన్నారు.